Home తాజా వార్తలు సైరా సిన్మాలో సాయి పల్లవి తండ్రి…

సైరా సిన్మాలో సాయి పల్లవి తండ్రి…

sai-pallavi-father

టాలీవుడ్: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహరెడ్డి. ఈ సిన్మాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఫిదా మూవీలో సాయి పల్లవికి తండ్రిగా నటించిన సాయిచంద్ సైరాలో నటించనున్నాడట. సాయిచంద్ సెలెక్టెడ్ రోల్స్‌లోనే ఎక్కువగా నటిస్తుంటాడు. కాగా.. సైరాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం చిత్రయూనిట్ సాయిచంద్‌ను సంప్రదించిందని సమాచారం. ఈ పాత్రకు సాయిచంద్ కూడా ఒకె అన్నట్టు తెలుస్తోంది. సాయిచంద్ 80వ దశకంలో వచ్చిన మాభూమి, రంగులకల, మంచు పల్లకి, ఆడవాళ్లే అలిగితే, శివ, అంకురం లాంటి సినిమాల్లో నటించాడు. రూ.200 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సిన్మాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నయనతార, కన్నడ హీరో సుదీప్, తమిళ్ హీరో విజయ్ సేతుపతి నటించనున్నారు.