Search
Saturday 22 September 2018
  • :
  • :

స్పెషల్‌ మూవీలో సాయి పల్లవి

sai
‘ఫిదా’ సినిమాలో భానుమతి పాత్ర ద్వారా ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తార సాయి పల్లవి. తాను ఒకే తరహా సినిమాలకు కట్టుబడనని తన కథల ఎంపిక ద్వారా ఆమె తెలియజేస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘కణం’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా, ధనుష్‌తో కలిసి మరో సినిమా చేస్తున్న ఆమె తెలుగులో శర్వానంద్‌తో ‘పడి లేచే మనసు’ చిత్రం చేస్తోంది. వీటి తర్వాత రొమాంటిక్ సినిమాలు తీస్తాడన్న పేరున్న మిస్కిన్‌తో ఓ రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్‌లో ఆమెనటించనుందనే వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా మిస్కిన్ సినిమాలన్నీ ‘ఎ’ సర్టిఫికెట్ మాత్రమే తెచ్చుకుంటాయి. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను ఆయన ఎప్పుడూ చేయలేదు. ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పుడు మిస్కిన్ తీయబోయే సినిమాలో సాయి పల్లవి అంటే ఖచ్చితంగా అది స్పెషల్‌గా ఉంటుందనే చెప్పుకోవాలి. పైగా దీనికి మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా సంగీతాన్ని అందించనుండడం విశేషం. సీనియర్ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ తనయుడు శంతను హీరోగా నటించే ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో నటించేందుకు ఇప్పటికే సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియరానున్నాయి.

Comments

comments