Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మంజుల డైరెక్షన్‌లో సాయి పల్లవి

Sai-pallaviమలయాళ ‘ప్రేమమ్’తో కేరళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది సాయి పల్లవి. ఈ చిత్రంలో సహజమైన అందంతో ఎంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఈ భామ ప్రస్తుతం తెలుగులో ఓ మూవీ చేస్తోంది. వరుణ్‌తేజ్  హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. తెలుగులో మొదటి మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే మరో సూపర్ ఛాన్స్‌ను సాయి పల్లవి పట్టేసింది. యంగ్ హీరో సందీప్ కిషన్‌కు హీరోయిన్‌గా ఓ ఓ మూవీ చేసేందుకు సైన్ చేసింది ఈ అమ్మడు. షో, ఆరెంజ్ వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకున్న స్టార్ హీరో మహేష్‌బాబు సోదరి మంజుల ఈ మూవీ ద్వారా డైరెక్టర్‌గా పరిచయం కానుండడం విశేషం. ఇంకా టైటిల్ ఫైనల్ కాని ఈ చిత్రంలో సందీప్ కిషన్ న్యూ లుక్‌లో కనిపిస్తాడట. గోవా, లండన్‌తో పాటు ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్‌ను జరుపనున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుండగా ఈ చిత్రాన్ని శరవేగంగా షూటింగ్ చేసేలా ప్లాన్ చేసినట్లు తెలిసింది. కేవలం రెండు నెలల సమయంలోనే షూటింగ్ పూర్తిచేసేలా ప్లాన్ చేయడం విశేషం. టెక్నికల్ టీంను ప్రస్తుతం ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు నిర్మాత జెమినీ కిరణ్.

Comments

comments