Home సినిమా కానిస్టేబుల్‌తో ప్రేమలో…

కానిస్టేబుల్‌తో ప్రేమలో…

‘నీది నాది ఒకే కథ’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వేణు ఉడుగుల తన నెక్స్ సినిమా కోసం ఆసక్తికరమైన కథను తయారు చేసుకున్నాడట. మొదట్లో ఈ సినిమాకు హీరోగా శర్వానంద్‌ను అనుకున్నప్పటికీ చివరికి అతని స్థానంలో రానా దగ్గుబాటిని హీరోగా ఫైనల్ చేశారు. ‘విరాటపర్వం 1992’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందట. తాజాగా ఈ సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రల గురించి తెలిసింది. రానా ఈ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్‌గా నటిస్తారట. సాయి పల్లవి నక్సలైట్‌గా కనిపిస్తుందట. ఆమె కానిస్టేబుల్ రానాతో ప్రేమలో పడిపోతుందని అంటున్నారు. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కే ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందట. మొదటిసారి రానా, సాయిపల్లవి కలిసి నటించే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడం ఖాయం.

Sai Pallavi to Love a Police Constable in Next Film

Telangana News