Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ద్విభాషా చిత్రంలో సాయి పల్లవి

 Sai Pallavis Next With Arjun Reddy Actor

తమిళ విలక్షణ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ కథానాయకుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. అర్జున్‌రెడ్డి తమిళ్ రీమేక్ ‘వర్మ’ చిత్రంలో అతను నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్రలో ధృవ్ నటిస్తున్నాడు. బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ధృవ్ నటించే రెండో సినిమాకు సంబంధించిన విషయాలు బయటికి వస్తున్నాయి. అతను నెక్స్ ఓ ద్విభాషా చిత్రంలో నటించనున్నాడని తెలిసింది. లీడర్, ఫిదా చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందట. ఇందులో ధృవ్ పక్కన ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవిని తీసుకుంటున్నారట. పలువురు కథానాయికల పేర్లను పరిశీలించిన కమ్ములకు సాయి పల్లవి ని మించిన హీరోయిన్ కనిపించలేదట. ఆమె అయితే తెలుగు, తమిళ్‌లో పాపులర్. ఈ సినిమాలో ఆమె నటిస్తే రెండు భాషల్లో మంచి బిజినెస్ అవుతుందని శేఖర్ కమ్ముల భావిస్తున్నాడట. దీంతో సాయిపల్లవికి కథ వినిపించి ఆమెను నాయికగా ఫైనల్ చేశారట.

Comments

comments