Home తాజా వార్తలు షూటింగ్‌లో గాయపడ్డ సైఫ్

షూటింగ్‌లో గాయపడ్డ సైఫ్

Saif-Ali-Khanన్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ గాయపడ్డారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన బొటన వేలికి తీవ్రంగా గాయమైందని ఆయన సోదరి సోహా అలీఖాన్ తెలిపింది. సైఫ్ కు గాయం అయిందని, ఇప్పటికే చికిత్స కూడా పూర్తయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆమె తెలిపింది. 45 ఏళ్ల సైఫ్ ఓ చిత్రం షూటింగ్ లో ఉండగా అనూహ్యంగా గాయపడ్డాడు. బొటన వేలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, తొలుత ఈ విషయం బయటకు రానివ్వలేదు. కాగా ఆయన సోదరి సోహా అలీఖాన్ మాత్రం తన సోదరుడు గాయపడి కోలుకుంటున్నాడని ఆదివారం ప్రకటించింది. దీంతో సైఫ్ నిజంగానే గాయపడ్డాడనే విషయం స్పష్టమైంది