Home తాజా వార్తలు ఆసియా క్రీడలు: సెమీస్‌లో సైనా ఓటమి

ఆసియా క్రీడలు: సెమీస్‌లో సైనా ఓటమి

Saina Nehwal settles for Bronze in Asian Games 2018

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ లో చైనీస్ తైపీకి చెందిన వరల్డ్ నెం.01 ర్యాంకర్ తై జు యింగ్ చేతిలో సైనా 21-17, 14-21 తేడాతో ఓడిపోయింది. ఈ పరాజయంతో సైనా కాంస్యంతోనే సరిపెట్టుకున్నట్టైంది. 2013 నుంచి తై జు చేతిలో సైనా ఓడిపోవడం వరుసగా ఇది పదోసారి. కాగా,  ఆసియా క్రీడల చరిత్రలో బ్యాడ్మింటన్ సింగిల్స్ పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారిణీగా సైనా రికార్డుకెక్కింది. ఈ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 37 పతకాలు గెలిచింది. వీటిలో 7 స్వర్ణం, 10 రజతం, 20 కాంస్య పతకాలు ఉన్నాయి.