Home తాజా వార్తలు సైనాకు శస్త్రచికిత్స

సైనాకు శస్త్రచికిత్స

Saina-Nehwalముంబయి: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వల్ మోకాలకు శనివారం ముంబయిలో శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఈ మేరకు సైనా నెహ్వల్ వైద్యుల ప్రిస్కిప్షన్‌ను ట్విట్టర్‌లో ఉంచింది. తనకు ఉదయం 6గంటలకు శస్త్రచికిత్స చేస్తారని .. దాని గురించి ఆలోచనతో నిద్రపట్టడంలేదని.. తన కోసం ప్రార్థించాలని ట్విట్టర్‌లో పేర్కొంది. ఉక్రెయిన్‌కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలైన సైనా గ్రూప్ దశలోనే ఒలింపిక్స్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మోకాలు సమస్య ఉందని ప్రకటించింది.