Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

క్వార్టర్‌ఫైనల్స్‌లోకి సైనా, సింధు, శ్రీకాంత్

Saina, Sindhu, Srikanth enter quarterfinals

బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్
వుహాన్ (చైనా): ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గురువారం కామన్వెల్త్ స్వర్ణపతక విజేత సైనా నెహ్వాల్, ఒలింపిక్ రజత పతక విజేత పి.వి.సింధు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో బాగా రాణించారు. కాగా టాప్ సీడ్ కిదాంబి శ్రీకాంత్, ప్రపంచ నెం. 10 ఆటగాడు హెచ్.ఎస్. ప్ర ణయ్ పురుషుల సింగిల్స్‌లో ముందుకు దూసుకుపోయారు. సైనా చైనాకు చెందిన గావో ఫాంజీని 40 ని మిషాల పోరులో 2118, 218తో ఓడించింది. త దుపరి ఆమె కొరియాకు చెందిన లీ జాంగ్ మితో తలపడనున్నది. ఇక మూడో సీడెడ్ సింధు మరో చైనా క్రీ డాకారిణి చెన్ జియాక్సిన్‌ను 2112, 2115తో ప్రీక్వార్టర్ ఫైనల్‌లో ఓడించింది. తదుపరి ఆమె ఏ డవ సీడెడ్ కొరియా క్రీడాకారిణి సుంగ్ జీ హున్న్ లే క థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఓంగ్బమ్రంగ్ఫాన్‌తో తలపడనున్నది. శ్రీకాంత్ తన ప్రత్యర్థి హాంకాంగ్‌కు చెందిన వాంగ్ వింగ్‌కి విన్సెంట్‌పై సునాయాసంగా గెలిచాడు. వాంగ్ తొలి గేమ్‌లోనే 27 వద్ద రి టైరయ్యాడు. ఇక గుంటూరుకు చెందిన 25 ఏళ్ల శ్రీ కాంత్ లీ చాంగ్ వీతో శుక్రవారం తలపడనున్నాడు. ఇదిలా ఉండగా ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరిన ప్రణయ్ మళ్లీ పుంజుకుని ఇప్పుడు తన ప్రత్యర్థి చైనీస్ తైపీకి చెందిన క్రీడాకారుడు వాంగ్‌జు వీ పై 1621, 2114, 2112తో గెలుపొందాడు. తదుపరి అతడు కొరియాకు చెందిన రెండో సీడెడ్ సన్ వాన్ హోతో తలపడనున్నాడు. పురుషుల డబుల్స్ జోడీ అర్జున్, రామచంద్రన్ శ్లోక్ చైనా జోడీ లీ జున్హుయి, లియు యుచెన్ చేతిలో 1121, 1921తో ఓడిపోయారు. కాగా మహిళల డబుల్స్ జోడీ మేఘనా జక్కంపూడి, పూర్విషా థాయ్ జోడీ జోంగ్‌కోల్‌ఫాన్ కితితరాకుల్, రవిండా ప్రజోంగ్ చేతిలో 23 నిమిషాలపాటు పోరాడి 921, 921తో ఓడిపోయింది.

Comments

comments