Home తాజా వార్తలు ఉత్కంఠ పోరులో సైనా విజయం

ఉత్కంఠ పోరులో సైనా విజయం

saina

నాగ్‌పూర్: జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సైనా నెహ్వల్ కైవసం చేసుకుంది. పోటాపోటీగా జరిగిన ఈ ఫైనల్‌లో సింధుపై సైనా గెలుపొందింది. బుధవారం జరిగిన ఫైనల్‌లో పివి సింధుపై 21-17,27-25 తేడాతో సైనా విజయం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో రుత్వికా శివానిపై 17-21,21-15,21-11 తేడాతో సింధు , అనురా ప్రభుదేశాయ్‌పై 21-11,21-10 తేడాతో సైనా గెలిచి ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.