Home తాజా వార్తలు దసరాకి విడుదల కానున్న ’సైరా‘

దసరాకి విడుదల కానున్న ’సైరా‘

Saira' film to be Released to Dussehraహైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ’సైరా‘ సినిమాను వచ్చే దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిరు నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. బిగ్ బి అమితాబ్‌బచ్చన్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అనివార్య కారణాలతో ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ను  వేగవంతం చేశారు. ఇప్పటికే కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలని తెరకెక్కించారు. ఇంకా ఈ సినిమాలో జగపతిబాబు, విజయ్‌సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  నాగబాబు కూతురు నిహారిక కూడా ఓ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలని ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు.

Saira’ film to be Released to Dussehra