Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

యుఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే సాకేత్ మైనేని ఔట్

* తొడ కండరాలు పట్టేయడంతో విఫలం
* జొకోవిచ్‌తో ఆడే అవకాశం మిస్
sakethన్యూయార్క్: యుఎస్ ఓపెన్-2016 టెన్నిస్ పురుషుల సింగిల్స్ పోటీలో మంగళవారం తొలి రౌండ్‌లోనే సాకేత్ మైనేని ఓటమి పాలయ్యాడు. జిరి వెస్లీ( చెక్ రిపబ్లిక్) చేతిలో 6-7, 6-4, 6-2, 2-6, 5-7 తేడాతో పరాజయం పాలై పోటీ నుంచి నిష్క్రమించాడు. 3గంటల 47 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సాకేత్ పోరాడి ఓడాడు. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో కోల్పోయిన సాకేత్, రెండు, మూడు సెట్‌లను కైవసం చేసుకున్నాడు. కానీ వెస్లీ తిరిగి పుంజుకుని నాల్గో సెట్‌ను కైవసం చేసుకోవడంతో స్కోరు సమమైంది. దాంతో నిర్ణయాత్మక ఐదో సెట్ అనివార్యమైంది. ఆ సెట్ ఆదిలో సాకేత్ 3-1, 4-2 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్ళినా, కుడి తొడ కండరాలు పట్టేయడంతో చికిత్స కోసం కొంత సమయం తీసుకున్నాడు. మళ్లీ బరిలోకి వచ్చినా పూర్తిస్థాయిలో ఆడలేక ఓటమి పాలయ్యాడు. రెండు రోజుల క్రితం యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాకు సాకేత్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లోనే తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్కీ మెయిన్‌కు అర్హత కూడా పొందాడు. కానీ తొలిరౌండ్‌లోనే సాకేత్ ఓడిపోవడంతో టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్ళలో ఒకడైన ప్రపంచ నం. 1 నొవాక్ జొకోవిచ్‌తో తలపడే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. ఈ మ్యాచ్‌ను గెలిచి ఉంటే రెండో రౌండ్‌లో జొకోవిచ్‌తో తలపడి ఉండేవాడు.

Comments

comments