Search
Wednesday 19 September 2018
  • :
  • :

అమెరికాకు సాక్ష్యం

srnvs

శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సాక్ష్యం’ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన బెల్లకొండ శ్రీనివాస్, పూజాహెగ్డేల ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలోని భారీ సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. శ్రీవాస్ డైరెక్షన్ స్కిల్స్, ఆయన స్క్రిప్ట్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఆయన ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలుస్తున్నారు. డూప్ లేకుండా శ్రీనివాస్ చేసిన యాక్షన్ సీన్స్, పూజా హెగ్డేతో రొమాంటిక్  సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. తాజా షెడ్యూల్ పూర్తికాగానే చివరి షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లనున్నారు. అమెరికాలో చిత్రీకరించబోయే కీలక సన్నివేశాలతో చిత్రీకరణ పూర్తవుతుంది. జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః ఆర్ధర్ ఎ.విల్సన్, సంగీతంః హర్షవర్ధన్, మాటలుః సాయిమాధవ్ బుర్రా, కూర్పుః కోటగిరి వెంకటేశ్వరరావు, యాక్షన్‌ః పీటర్ హెయిన్స్.

Comments

comments