Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

రేషన్ డీలర్ల రాస్థారోకో

salary of honor ration dealers should be paid

పెద్దపల్లి: సిఎం కెసిఆర్ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి, గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు శనివారం పెద్దపల్లి బాస్టాండ్ ముందు గోదావరిఖని, కరీంనగర్ రాజీవ్ రహదారిపై రాస్థారోకో చేపట్టారు. దీనితో రహదారిపై గంట సేపు ట్రాఫిక్ నిలిచి పోయి, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. ఘటన స్థలానికి సిఐ గోపతి నరేందర్ వచ్చి డీలర్లకు నచ్చజెప్పి రాస్థారోకో విరమింపజేశారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి మద్దెల నర్సయ్య, నాయకులు కొమురయ్యగౌడ్, బొల్లి రవి, సునీత, బాగ్య, శరణ్ తదితరులున్నారు.

Comments

comments