Home అంతర్జాతీయ వార్తలు ‘ఫోర్బ్’ టాప్-10లో అమితాబ్, సల్మాన్‌ఖాన్

‘ఫోర్బ్’ టాప్-10లో అమితాబ్, సల్మాన్‌ఖాన్

మొదటి, 2వ స్థానంలో రాబర్ట్ డౌనీ, జాకీచాన్
9వ స్థానంలో నిలిచిన అక్షయ్‌కుమార్

forbes_manatelanganaవాషింగ్టన్:  ప్రపంచంలో అత్యధిక  పారితోషికం చెల్లించబడుతున్న టాప్ టెన్ అగ్రనటుల జాబితాలోకి బాలీవుడ్‌స్టార్స్ అమితాబ్‌బచ్చన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్  చేరారు. హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ సుమారు రూ.509కోట్ల సంపాదనతో టాప్‌టెన్ జాబితాలో మొదటి స్థానంలో నిల వగా, ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ సుమారు రూ.౩15కోట్ల సంపా దనతో జాబితాలో రెండవ స్థానంలో నిలిచారని ఫోర్బ్ వివరించింది. కాగా, ఈ విషయమై ‘ఫోర్బ్’ మ్యాగజైన్ తొలిసారిగా వెల్లడించిన ప్రపంచ వ్యాప్త జాబితాలో హాంకాంగ్ కేంద్రంగా ఉన్న హాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు ఉన్న అగ్రనటులు పలువురికి చోటు దక్కింది. అమితాబ్‌బచ్చన్, సల్మాన్‌ఖాన్ సంయుక్తంగా ఏడవ స్థానాన్ని ఆక్రమించి జాబితాలో చోటుదక్కించుకు న్నారు.

గతేడాది వీరి సంపాదన 33.5మిలియన్ డాలర్ల (రూ.213.32 కోట్లు) మేరకు ఉందని తెలిపింది. 9వ స్థానంలో నిలిచిన అక్షయ్‌కుమార్ సంపాదన సుమారు రూ.207కోట్లుగా ఉందని వెల్లడించింది. బాలీవుడ్ స్టార్స్ షారూఖ్‌ఖాన్ (18), సుమారు రూ. 165కోట్లు, రణ్‌బీర్‌కపూర్ (30) సుమారు రూ.101కోట్లు సంపాదనను కలిగిఉన్నారని ఫోర్బ్ జాబితా తెలియజేసింది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌బచ్చన్ ఆయన 50ఏళ్ల సినీ జీవితంలో 150సినిమాల్లో నటించారని వివరించింది. ఆయన 2014లో నటించిన ‘భూథ్‌నాథ్ రిటర్న్’ చిత్రం హిట్ కావడంతో అత్యధిక పారి తోషికం అందుకోవడం మొదలైందని ఫోర్బ్ వెల్లడించింది. భారతదేశంలో బిగ్‌స్టార్స్‌గా పేరొందిన సల్మాన్‌ఖాన్ 1989నుంచి 80సినిమాల్లో నటిం చారని, ‘మైనే ప్యార్‌కియా’ విజయం ఆయనకు గుర్తింపునిచ్చిందని తెలి పింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్‌కు ‘ఖిలాడీ’ చిత్రం గుర్తింపుని చ్చిందని పేర్కొంది. టాప్‌టెన్ జాబితాలో వరుసగా విన్ డీసెల్ (3వ స్థానం), బ్రాడ్లే కూపర్ (4వ స్థానం), టామ్ క్రూయిజ్ (6వ స్థానం), మార్క్ వాహ్ల్‌బెర్గ్ (10వ స్థానం) దక్కించుకున్నట్లు ఫోర్బ్ జాబితా తెలియజేసింది.