Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

సల్మాన్‌కు తిరిగి దగ్గరైన కత్రినా

Salman-With-Katrina

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్‌ల మధ్య ఒకప్పుడు జోరుగా ప్రేమాయణం కొనసాగిన విషయం తెలిసిందే. ఆతర్వాత వీరిమధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. చివరికి కలిసి సినిమాలు కూడా చేయలేదు. ఆతర్వాత రణబీర్‌తో కత్రినా ప్రేమ, విడిపోవడం కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఫితూర్, బార్ బార్ దేఖో చిత్రాల పరాజయాలతో కత్రినాకైఫ్ తీవ్ర నిరాశకు గురైంది. ఇదే సమయంలో సల్మాన్‌కు మళ్లీ కత్రినా దగ్గరైందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కత్రినా కెరీర్‌ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్న సల్మాన్… తన స్పై థ్రిల్లర్ మూవీ ‘టైగర్ జిందాహై’లో అవకాశం ఇప్పించాడు. అంతేకాదు మరో విధంగా కూడా ఆమెకు సహాయం చేస్తున్నాడు. తాను బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్న ఓ కంపెనీ కత్రినాకైఫ్‌తో కూడా ఒప్పందం చేసుకునేందుకు ఒప్పించాడట సల్మాన్. తాజాగా సల్మాన్, కత్రినాలు ‘టైగర్ జిందాహై’ షూటింగ్ కోసం ఆస్ట్రియా వెళ్లగా… అంతకుముందే ఆ ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీకి వీళ్లిద్దరూ ఫొటో షూట్ చేశారు. ఆస్ట్రియా నుంచి తిరిగి వచ్చాక ఈ బ్రాండ్ కోసం మరోసారి ఫొటోషూట్‌లో వీళ్లిద్దరూ పాల్గొంటారు.

Comments

comments