Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సల్మాన్ కేసులో మరో ట్విస్ట్

salmanజైపూర్ : బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు కేసులు, వివాదాలు కొత్తేం కాదు. తాజాగా సల్మాన్‌ఖాన్ కృష్ణ జింకల వేట కేసు మరో కొత్త మలుపు తిరిగింది. జింకలను చంపింది సలానేనని ఆనాడు డ్రైవర్‌గా ఉన్న హరీష్ దులానీ చెప్పడంతో కేసు మళ్లీ మొదటికి వచ్చేలా ఉంది. 2002లో కనిపించకుండా పోయిన హరీష్ హఠాత్తుగా తెరపైకి వచ్చాడు. ‘నన్ను చంపుతామని మా నాన్నను బెదిరించారు. దీంతో భయపడి జైపూర్ వదిలి పారిపోయాన’ని హరీష దులానీ చెప్పాడు. తనకు రక్షణ కల్పించివుంటే కోర్టులో సాక్షం చెప్పేవాడినని అన్నారు.
లిఖితపూర్వకంగా కోరితే అతడికి భద్రత కల్పిస్తామని రాజస్థాన్ హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా తెలిపారు. సల్మాన్‌ఖాన్ నిర్దోషని రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని న్యాయశాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ వెల్లడించారు. 1998లో జోధ్‌పూర్‌కు సమీపంలోని భావద్, మథానియా ప్రాంతాల్లో సల్మాన్, అతని సహ నటులు కలిసి కృష్ణజింకలను వేటాడిన కేసులో సరైన సాక్షాలు లేవని సల్మాన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలసిందే.

Comments

comments