Home సినిమా ఫోర్బ్స్ శ్రీమంతుల్లో సల్మాన్ టాప్

ఫోర్బ్స్ శ్రీమంతుల్లో సల్మాన్ టాప్

టాలీవుడ్ నుంచి మొదటిస్థానంలో పవన్

ఈ జాబితాలోకి విజయ్ దేవరకొండ!

ఈ లిస్టులో వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ అధిక సంపాదనతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. రెండవ స్థానాన్ని 228.9 కోట్ల ఆదాయంతో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి దక్కించుకున్నారు. అయితే మూడవ స్థానంలో ‘2.0’ పక్షిరాజా అక్షయ్ కుమార్ నిలిచారు. సంవత్సరానికి 185 కోట్ల సంపాదనతో ఆయన దూసుకుపోతున్నారు. విచిత్రం ఏమిటంటే బాలీవుడ్ బాద్‌షాగా పేరుతెచ్చుకున్న షారుఖ్‌ఖాన్ మాత్రం ఈ లిస్టులో 56 కోట్లతో టాప్-10లో తన స్థానాన్ని పోగొట్టుకున్నారు. ఈమధ్య వరుస పరాజయాలతో పాటు నిర్మాతగా కూడా దెబ్బతినడం షారుఖ్ బ్రాండ్‌ను దెబ్బతీసింది. టాప్-10లో వరుసగా దీపికా పదుకునే (112.8 కోట్లు), ఎం.ఎస్.ధోని (101.77 కోట్లు), అమీర్‌ఖాన్ (97.5 కోట్లు), అమితాబ్ బచ్చన్ (96.17 కోట్లు), రణవీర్ సింగ్ (84.67 కోట్లు), సచిన్ టెండూల్కర్ (80 కోట్లు), అజయ్ దేవగణ్ (74.5 కోట్లు) ఉన్నారు. ఇక సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ 50 కోట్ల సంపాదనతో 14వ స్థానంలో నిలిచారు. అయితే దక్షిణాది నుంచి అతనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇక టాలీవుడ్ నుంచి ఈ లిస్టులో 31.33 కోట్ల సంపాదనతో నంబర్ వన్ స్థానం పవన్‌కళ్యాణ్‌కు దక్కింది. సినిమాల నుంచి తప్పుకొని రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటికీ పవన్ ఈ జాబితాలో టాలీవుడ్ నుండి అగ్రస్థానంలో నిలవడం విశేషమే. మొత్తంగా ఇండియాలో పవన్‌ది 24వ స్థానం. పవన్ తర్వాత టాలీవుడ్ నుంచి అత్యుత్తమ స్థానం ఎన్టీఆర్‌దే. అతను 28 కోట్ల సంపాదనతో ఫోర్బ్ జాబితాలో 28వ స్థానాన్ని దక్కించుకున్నారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు 24.33 కోట్ల సంపాదనతో 33వ ర్యాంకును దక్కించుకున్నారు. సూర్యకు 34వ స్థానం (23.67 కోట్లు), అక్కినేని నాగార్జునకు 36వ స్థానం (22.25 కోట్లు), కొరటాల శివకు 39వ స్థానం (20 కోట్లు), ధనుష్‌కు 53వ స్థానం (17.25 కోట్లు), అల్లు అర్జున్‌కు 64వ స్థానం (15 కోట్లు) దక్కింది. అయితే ఫోర్బ్ లిస్టులో రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ సమానంగా 72వ స్థానంలో ఉండటం విశేషం. వీరిద్దరూ 14 కోట్ల ఆదాయంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అర్జున్‌రెడ్డి చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఆతర్వాత గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందుకొని టాలీవుడ్‌లో యంగ్‌స్టార్‌గా నిలిచారు. ఇప్పుడు అతను ఏకంగా ఫోర్బ్ జాబితాలో 72వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

Salman Khan Hits Top in Forbes India Rich List

Telangana news