Home తాజా వార్తలు అప్పుడే ప్యాకప్ చెప్పిన స‌ల్మాన్ ఖాన్..

అప్పుడే ప్యాకప్ చెప్పిన స‌ల్మాన్ ఖాన్..

Salmankhan

బాలీవుడ్: సల్మాన్ ఖాన్‌ రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్న రేస్ 3 షూటింగ్ మధ్యలోనే ప్యాకప్ చెప్పేశారు. కృష్ణజింక కేసులో విచారణకు  జోద్‌పూర్ కోర్టుకి వెళ్ళిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ విష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్ బెదిరించిన విషయం తెలిసిందే. జ‌న‌వ‌రి ఐదో   తారీఖు నాడు ఈ ఘటన జోద్‌పూర్ కోర్టులో  చోటుచేసుకుంది. అయితే తాజాగా కొంద‌రు గుర్తు తెలియ‌ని దుండగులు రేస్ 3 షూటింగ్ ప‌రిస‌ర ప్రాంతాల‌లో తిరగటం గమనించిన చిత్ర బృదం  వెంట‌నే పోలీసులకి స‌మాచారం అందించారు. దీంతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు స‌ల్మాన్‌ని, చిత్ర నిర్మాత ర‌మేష్ తౌరానిని ఎస్కార్ట్ వాహ‌నంలో తన ఇంటికి పంపించారు. షూటింగ్ మ‌ధ్య‌లోనే స‌ల్మాన్ ఇంటికి వెళ్లడంతో, అత‌ని కారుని కొంద‌రు పోలీసులు స‌ల్మాన్ ఇంటికి చెరవేసినట్లు సమాచారం. అతి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న షెడ్యూల్ కోసం స‌ల్మాన్‌కి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామ‌ని పోలీసులు తెలిపారు. రేస్ 3 సినిమాలో స‌ల్మాన్ జోడిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ నటింస్తుండగా, అనీల్ క‌పూర్‌, డైసీ షా, బాబీ డియోల్, సాఖీబ్ సలీమ్ , ఫ్రీడీ దరువాలాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సంవత్సరం ఈద్ కానుకగా మూవీ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లానింగ్ లో ఉంది. ప్రస్తుతం రేస్ 3 చిత్రం గుర్గావ్ లోని ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ సిరీస్ .. రేస్ లో వ‌చ్చిన రెండు సీక్వెల్స్ మంచి విజ‌యం సాధించ‌డంతో రేస్ 3 సిన్మా పై కూడా చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.