Home తాజా వార్తలు మరోసారి ఆన్‌స్క్రీన్ రొమాన్స్

మరోసారి ఆన్‌స్క్రీన్ రొమాన్స్

Salman-Khan-and-Katrina-Kai

వయసు 50 దాటినా ఇంకా బ్యాచిలర్‌గా ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ వరుస హిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం అతనితో హాట్ బ్యూటీ కత్రినాకైఫ్ వరుసగా సినిమాలు చేస్తుండడం విశేషం. ‘టైగర్ జిందాహై’ సినిమాలో సల్మాన్‌కు జోడీగా ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌తో అదరగొట్టేసింది కత్రినాకైఫ్. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు జాఫర్ ‘భరత్’ టైటిల్‌తో మరో భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా నటించాల్సి ఉండగా ఆమె అకస్మాత్తుగా తప్పుకోవడంతో కత్రినాకైఫ్‌ను సల్మాన్ ఓకే చేశాడు. సల్మాన్‌తో కత్రినా ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌కు తిరుగులేదు కాబట్టి జాఫర్ వెంటనే ఆమెను హీరోయిన్‌గా ఖరారు చేశాడు. ప్రస్తుతం ‘భరత్’ సెట్స్‌పై ఉంది.