Search
Wednesday 17 October 2018
  • :
  • :

‘నా దెబ్బకు ఐష్ బతికేది కాదు’

Salman Khan's Ridiculous replay about Aishwarya Rai

ప్రస్తుతం దేశవ్యాప్తంగా #మీటూ ఉద్యమం ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తమపై జరిగిన లైంగిక దాడులను వివిధ రంగాలకు చెందిన మహిళలు బయటపెడుతున్నారు. కాగా, మాజీ ప్రపంచ సుందరి, బచ్చన్ కోడలు  ఐశ్వర్యరాయ్ బచ్చన్ సహ నటుడు అయిన సల్మాన్ ఖాన్ గురించి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా సల్మాన్ మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అది కాస్తా వైరల్ అవుతోంది. సల్లూ తనను తీవ్రంగా హింసించాడని చెప్పుకొచ్చిన ఐష్ ఆయన కొట్టిన దెబ్బల కారణంగా తన శరీరంపై మచ్చలు ఏర్పడకపోవడం తన అదృష్టమని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బయటకు వచ్చిన వీడియోలో ఓ టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఐశ్వర్యరాయ్ పై చేయిచేసుకున్నారట అని జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సల్మాన్… “అవును. ఇదే ప్రశ్న గతంలో జర్నలిస్టు ప్రభు చావ్లా చానాళ్ల క్రితమే అడిగింది. ఆ సమయంలో నాకు కోపం వచ్చి టేబుల్ పై గట్టిగా కొట్టాను. అది నిజంగా విరిగిపోయింది. అంటే నేను ఎవరినైనా కొడితే, అది కోపంతోనే జరుగుతుంది. నా దెబ్బ బలంగా ఉంటుంది. నేను కొట్టి ఉంటే ఆమె బతికుండేది కాదు” అని అన్నాడు. ప్రస్తుతం సల్మాన్ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. అయితే, సల్లూభాయ్ నిర్లక్ష్యపు సమాధానంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Salman Khan’s Ridiculous replay about Aishwarya Rai.

Telangana Breaking News

Comments

comments