Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సల్మాన్‌ఖాన్ కేసు వాయిదా

SALMAAN

జోధ్‌పూర్: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ కేసు వాయిదా పడింది. రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడినట్లు ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై తీర్పును ఈనెల 27వ తేదీకి వాయిదా వేసినట్లు జోధ్‌పూర్ కోర్టు బుధవారం ప్రకటించింది. గత వారం ఇదే కోర్టు అక్రమ ఆయుధాల కేసు నుంచి ఆయనకు విముక్తిని ప్రసాదించింది. ఈ కేసులో సాక్షుల వాంగ్మూలలను ఇప్పటికే నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్‌ఖాన్ వాంగ్మూలాన్ని 1998లోనే నమోదు చేసుకున్నారు. హమ్ సాథ్ సాథ్ హై సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. సైఫ్ అలీఖాన్, నీలమ్, సోనాలీ బెంద్రె , టబూలు ఈ కేసులో సహా నిందితులుగా ఉన్నారు.

Comments

comments