Home తాజా వార్తలు ఏప్రిల్ 5న సల్మాన్ కృష్ణజింకల వేట కేసు తీర్పు

ఏప్రిల్ 5న సల్మాన్ కృష్ణజింకల వేట కేసు తీర్పు

slman

జోధ్‌పూర్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ కృష్ణ జింకల వేట కేసులో ఏప్రిల్ 5న జోధ్‌పూర్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో సల్మాన్‌తో పాటు సైఫ్ అలీఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలమ్, దుశ్యత్ సింగ్ నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, బుధవారం ఈ కేసుకు సంబంధించి జోధ్‌పూర్ కోర్టులో తుదివాదనలు పూర్తయ్యాయి. సల్మాన్ ఖాన్ తరపున న్యాయవాది హస్తిమల్ సరస్వత్ తన వాదనలు వినిపించారు. 1999లో సూరజ్ బర్‌జ్యాత్య చిత్రం ‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లోని కంకణి గ్రామంలో రెండు కృష్ణ జింకలను వీరు వేటాడినట్లు స్థానిక బిష్ణోయ్ వర్గీయులు నిరసనలకు దిగడంతో పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు.