Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సుల్తాన్‌కు పైరసీ రక్కసి..?

Sultan-Movie-Posterముంబయి: బాలీవుడ్‌లో పైరసీ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. మొన్న ‘ఉడ్తా పంజాబ్’, నిన్న ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ చిత్రాల పైరసీ వివాదం మరువక ముందే ఇవాళ ‘సుల్తాన్’ మూవీకు సైతం పైరసీ రక్కసీ పట్టుకున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సుల్తాన్ సినిమా కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందన్న విషయం ఇప్పుడు చిత్ర యూనిట్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గతంలో మాదిరిగా అన్ని టోరెంట్ సైట్‌లో అందుబాటులో లేకున్నా కొన్ని వెబ్‌సైట్స్ నుంచి ఇప్పటికే సుల్తాన్ మూవీను డౌన్‌లోడ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని ముంబయి సైబర్ క్రైం ఎక్స్‌పర్ట్ ధృవీకరించారు. ఇప్పటికే నష్ట నివారణా చర్యలు చేపట్టిన చిత్ర బృందం పలు వెబ్‌సైట్స్ బ్లాక్ చేయించింది.

Comments

comments