Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

‘రాజుగారి గది-2’లో సమంత?

samantaగత ఏడు, ఎనిమిదేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన సమంత… ‘అ..ఆ’ తర్వాత అనుకోకుండా గ్యాప్ తీసుకుంది. అప్పటికే పూర్తయిన ‘జనతా గ్యారేజ్’ మినహాయిస్తే సమంత కొత్త సినిమాలేవీ రాలేదు. ఇప్పట్లో కొత్త సినిమాలు వచ్చేలా కూడా లేవు. తమిళంలో ఓ సినిమా కమిటైంది కానీ… తెలుగులో మాత్రం సమంతకు అవకాశాలే లేవు. ఇలాంటి తరుణంలో సమంతకు కాబోయే మావయ్య అక్కినేని నాగార్జునే ఆమెకు ఓ అవకాశం ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. నాగార్జున కీలక పాత్రలో నటించబోతున్న ‘రాజుగారి గది-2’లో సమంత ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. ఆమెతో పాటు సీరత్‌కపూర్ కూడా ఇందులో ఓ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఇంకో హీరోయిన్ కూడా ఉంటుందట. నాగార్జున ఇందులో మోడర్న్ మాంత్రికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు కుర్రాళ్లు… ముగ్గురు అమ్మాయిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సమంత, సీరత్‌కపూర్ కాకుండా ఇంకో అమ్మాయి కోసం వేట సాగుతోంది. ప్రస్తుతం దర్శకుడు ఓంకార్ స్క్రిప్టు ఫైనల్ చేసి… నటీనటుల ఎంపిక పనిలో ఉన్నాడు. పివిపి నిర్మించే ఈ సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ‘మనం’ తర్వాత నాగార్జున, సమంత కాంబినేషన్‌లో సినిమా రాబోతుండడం ఆసక్తి రేకెత్తించేదే.

Comments

comments