Search
Saturday 22 September 2018
  • :
  • :

చెన్నై రోడ్లపై కూర‌గాయ‌లు అమ్మిన సామ్..!

Samantha Akkineni Selling Vegetables on Chennai Roads

చెన్నై: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత చెన్నై రోడ్లపై కూరగాయలు అమ్ముతూ అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇదేదో సినిమా షూటింగ్ కోసమో లేక యాడ్ మేకింగ్ కోసమో కాదు. తాను స్వయంగా నడుపుతున్న ప్ర‌త్యూష ఫౌండేష‌న్ అనే స్వ‌చ్చంద సేవా సంస్థ కోసం ఆమె ఇలా వెజిటెబుల్స్ అమ్మి వచ్చిన నగదును సంస్థకు అందించారు. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా మంచి అభిమాన గణం ఉన్న సామ్, హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్న సమాజసేవ కోసం కూడా తన సమయాన్ని వెచ్చిస్తుంటుంది. ఇక ప్ర‌త్యూష ఫౌండేష‌న్ ద్వారా చిన్న పిల్లలకు, మహిళలకు చేయూత నిస్తున్నారు సమంత. తాజాగా ఈ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆమె చెన్నై వీధుల్లో రోడ్లపై కూరగాయలు అమ్ముతు కెమెరాకు చిక్కారు. దీని ద్వారా వచ్చి నగదును మానసిక వికలాంగులకు, వివిధ జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వినియోగించనున్నారు.

Samantha Akkineni Selling Vegetables on Chennai Roads

దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అక్కినేని వారసుడు నాగచైతన్యను వివాహమాడిన తరువాత సామ్ సెకండ్ ఇన్నింగ్స్ భారీ విజయాలతో మొదలైంది. తెలుగులో రంగస్థలం, మహానటి వంటి సూపర్ హిట్స్ వస్తే, తమిళంలో విశాల్ తో నటించిన అభిమన్యుడు చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం యూటర్న్ అనే చిత్రంతో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇది సామ్ చేస్తున్న తొలి లేడీ ఒరియంటెడ్ చిత్రం కావడం విశేషం. కాగా, అక్కినేని వారి కోడలు చేస్తున్న మంచి ప‌నులకి నెటిజ‌న్లు ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Comments

comments