Home గాసిప్స్ వామ్మో… సమంత… ఎప్పుడో మహేశ్ ను దాటేసింది..!!

వామ్మో… సమంత… ఎప్పుడో మహేశ్ ను దాటేసింది..!!

Mahesh-babu-samantha

చాలా వరకు సినిమాల్లో హీరోల డామినేషనే. హీరోయిన్ల పాత్ర ఎంత ఉన్నా హీరోలకే ఎక్కువ క్రేజు, గ్రీజు గట్రా… ఏదో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో కొంతమంది హీరోయిన్లకు హీరోల్లాగా స్టార్ డమ్ వస్తుంది.

అయితే, సోషల్ మీడియా ట్విట్టర్ లో మాత్రం సమంత… ప్రిన్స్ మహేశ్ బాబును డామినేట్ చేస్తున్నది. ట్విట్టర్ లో సమంత ఫాలోవర్స్ ముప్పై లక్షలు కాగా… మహేశ్ ఫాలోవర్స్ 26 లక్షల మందే.

ఈ విషయంపై మహేశ్ ఫ్యాన్స్ స్పందిస్తూ ప్రిన్స్ మహేశ్ ఎక్కువగా ట్విట్టర్ ను వాడడని, ఎప్పుడో మాత్రమే ట్విట్టర్ ద్వారా సందేశాలు అభిమానులకు పంపిస్తాడని… సమంత మాత్రం ఎప్పుడూ ట్విట్టర్ లో ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుందని అందుకే ఆమెకు ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు.

అంతే కాకుండా, ఈ మధ్య సమంత లవ్ ఎఫైర్ కూడా సోషల్ మీడియాలో వైరలవడంతో ఆ విషయాలు తెలుసుకోవడానికి ఫాలోవర్స్ పెరిగి ఉండవచ్చని మహేశ్ అభిమానులు చెబుతున్నారు.

ఏదేమైనా…. బాలీవుడ్ హీరోయిన్స్ కు ఉన్న క్రేజీ ని సమంత సంపాదించుకుందనడంలో సందేహమే లేదు… ఏమంటారు?