Home తాజా వార్తలు రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకున్న సమంత సిన్మాలు

రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకున్న సమంత సిన్మాలు

Samntha-image

సినిమా: సమంత ప్రస్తుతం తమిళంలో రెండు సిన్మాలు చేస్తోంది. ఒకటి ‘సీమరాజా’ మరొకటి ‘సూపర్ డీలక్స్’. ఈ రెండు సిన్మాల్లో ‘సీమరాజా’ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సిన్మాలో ఒక హీరోయిన్ గా సమంత నటిస్తుండగా,ఇంకో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ కనిపించనుంది. ఈ సిన్మాలో సమంత పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుంది. ఈ పాత్ర తనకి మరింత పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో సమంత వుందని తెలుస్తోంది. ‘వినాయకచవితి’ సందర్భంగా సెప్టెంబర్ 13వ తేదీన ఈ సిన్మాను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. తెలుగులోను ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తమిళంలో సమంత చేస్తున్న మరో సినిమా ‘సూపర్ డీలక్స్’ను అక్టోబర్ లో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ ఏడాది అంతా థియేటర్లలో సమంత సందడి చేయనుంది.