Home సినిమా మరో క్రేజీ పాత్రలో సమంత

మరో క్రేజీ పాత్రలో సమంత

Samanta

స్టార్ హీరోయిన్ సమంత నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతోంది. రాజుగారి గది-2, రంగస్థలం, మహానటి చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో నటించిన ఆమె తన నటనతో ప్రేక్షకులను మైమరపించింది. త్వరలో ‘యూ టర్న్’ వంటి విలక్షణ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మరో క్రేజీ పాత్రలో నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. 70 ఏళ్ల బామ్మ పాత్రలో ఆమె నటించబోతోందని అంటున్నారు. అతీత శక్తులను కలిగి యువతిగా మారిపోయే వృద్ధురాలి పాత్రలో నటించేందుకు సమంత ఓకే చెప్పిందట. 2014లో వచ్చిన కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించనుందని తెలిసింది. ఈ చిత్రం కథ విషయంలో సమంత, నందిని మధ్య కొన్ని రోజులుగా స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నాయట. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలంటే కొంతకాలం ఎదురు చూడక తప్పదు.