Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రామ్ చరణ్ ను టెన్షన్ పెడుతున్న సమంత మ్యారేజ్..?

Samantha is Out form Ramcharan and Sukumar movie

ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువగా పుకార్లు వస్తున్నాయి అంంటే… అవి నాగార్జున ఫ్యామిలీ నుంచే. రీసెంట్ గా అఖిల్, శ్రేయా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే… ఆ వార్తలను నాగార్జున ఫ్యామిలీ కూడా ఖండించలేదు. అలాగని.. అఖిల్, శ్రేయ పెళ్లి గురించి ఎటువంటి అప్ డేట్ కూడా ఇవ్వలేదు.

కాని… నాగ చైతన్య, సమంత పెళ్లి మాత్రం తొందరగా చేయాలనే ఆలోచనలో నాగార్జున ఫ్యామిలీ ఉన్నట్లు సమాచారం. ఇది వరకు మేలో ఈ జంట పెళ్లి చేయడానికి నాగ్ నిర్ణయించాడట. అందుకని… ఈలోపు ఒకటో రెండో సినిమాలు చేసుకొని నాలుగు రాళ్లు వెనకేసుకుందామని సమంత అనుకుందో ఏమో… వెంటనే రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఇదివరకే రామ్ చరణ్, సుకుమార్ కాంబో మూవీ లో రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరన్ లను హీరోయిన్లుగా తీసుకున్నా… కొన్ని కారణాల వల్ల వాళ్లను తప్పించిందట మూవీ యూనిట్. తర్వాత సమంత ను మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారట.

Samantha is Out form Ramcharan and Sukumar movie

షూటింగ్ కూడా ప్రారంభమైన ఈ మూవీ లో ఇప్పుడు వస్తున్న పుకారేంటంటే… సమంత కూడా ఈ మూవీ నుంచి తప్పుకుందట. నాగ్ త్వరగా చైతన్య, సమంత పెళ్లి చేయాలని నిశ్చయించడంతో సమంత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట.

పెళ్లి తర్వాతే నటించడానికి సమంత సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీంతో రామ్ చరణ్ కు టెన్షన్ పట్టుకుందట. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను తప్పించి… మరో హీరోయిన్ ను తీసుకుంటే… షూటింగ్ మధ్యలో సమంత కూడా వెళ్లిపోవడంతో దసరా కు రిలీజ్ చేద్దామనుకున్న ఈ మూవీ లేటయ్యే అవకాశాలు ఉండటంతో ఇప్పుడు రామ్ చరణ్ కు సమంత పెళ్లి టెన్షన్ పట్టుకుందట.

సమంత పెళ్లి ఎప్పుడవుతుందో… ఎప్పుడు వచ్చి రామ్ చరణ్ మూవీ లో నటిస్తుందో…. ఎప్పుడు రామ్ చరణ్ మూవీ రిలీజవుతుందో ఆ దేవుడికే తెలియాలి.. దేవుడా…

Comments

comments