Home తాజా వార్తలు మామా.. థాంక్యూ: సమంత

మామా.. థాంక్యూ: సమంత

Samantha-and-Nagarjuna

సమంత నటించిన “రంగస్థలం” హిట్ కావడంతో అభిమానులు, అక్కినేని కుటుంబం సంతోషంలో ఉన్నారు. ఈ సినిమాలో  రామ లక్ష్మి అనే పల్లెటూరు అమ్మాయి పాత్రలో సమంత నటించిన విషయం తెలిసిందే. నటుడు నాగార్జున “రంగస్థలం”పై ట్విట్ చేశారు. లచ్చిమి పాత్రకు సమంత ప్రాణం పోసిందని, ఆమె నటన చూసి తాను గర్విస్తున్నానని కొనియాడారు. చిట్టిబాబు పాత్ర చేసింది చరణేనా అన్నట్టుగా అతడు జీవించేశారని  ప్రశంసించారు. పల్లెటూరు వాతావరణం కలిగిన సినిమా తీయడంతో సుకుమార్ విజయం సాధించడంటూ అభినందించారు. థ్యాంక్యూ మామా అంటూ సమంత రిట్విట్ చేశారు.