Search
Wednesday 21 November 2018
  • :
  • :

సమంత ద్విపాత్రాభినయం

Samantah

అక్కినేని కోడలు సమంత కెరీర్ ప్రస్తుతం దూసుకుపోతోంది. వరుస విజయాలతో ఆమెకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఇక ప్రస్తుతం సోలో నాయికగా నటనకు ఆస్కారం ఉన్న కథలను ఎంచుకొని సత్తా చాటేందుకు సమంత ఉవ్విళ్లూరుతోంది. ఇక ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో కలిసి ఆమె ఓ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి సమంత ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇది ఓ కొరియన్ సినిమాకు అధికారిక రీమేక్. ‘మిస్ గ్రానీ’ అనేది టైటిల్. నాయనమ్మ, మనవరాలు మధ్య సాగే ఆసక్తి కర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో సమంత నాయనమ్మగా, మనవరాలిగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలిసింది. అంటే ఇటీవల బాలీవుడ్ నాయిక అనుష్క శర్మ చేస్తున్న ప్రయోగాల తరహాలోనే సమంత తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకునేందుకు ఆస్కారం ఉన్న సినిమా ఇది. ఇప్పటికే దర్శకురాలు నందిని రెడ్డి ఈ సినిమా స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాగశౌర్య కథానాయకుడిగా నటించనున్నారు.

Samantha Playing Dual Role In her Next Film 

Telangana News

Comments

comments