Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

మరో సినిమాను ప్రారంభించబోతోంది

samanthaనాగచైతన్య, సమంత  పెళ్లికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. అక్టోబర్ 6న ఈ జంట వివాహం జరుగనుంది. ఇలాంటి సమయంలో ఎవరైనా కాస్త సినిమాలు తగ్గించుకుంటారు. నాగచైతన్య అదే పని చేస్తున్నాడు. కానీ సమంత మాత్రం కొత్తగా మరో సినిమా ప్రారంభించబోతోంది. తమిళ్‌లో శివకార్తికేయన్ హీరోగా నటించనున్న సినిమాకు ఫ్రెష్‌గా కాల్షీట్లు కేటాయించింది సమంత. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు తెలుగు సినిమాలున్నాయి. మరో రెండు తమిళ సినిమాలు కూడా సెట్స్‌పై ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు మరో కోలీవుడ్ మూవీకి కూడా డేట్స్ ఇచ్చింది. తెలుగులో మహానటి, రాజుగారి గది-2, రంగస్థలం సినిమాల్లో నటిస్తోంది సమంత. అటు తమిళ్‌లో విజయ్, విశాల్‌తో సినిమాలు చేస్తోంది. ఈనెల 16 నుంచి శివకార్తికేయన్‌తో కలిసి సెట్స్‌పైకి వెళ్లబోతోంది సమంత. ఇక పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తుందని నాగచైతన్య ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. అటు సమంత కూడా ఇదే విషయం చెప్పింది. అయితే సెప్టెంబర్ నుంచి ఈ జంట మూడు నెలల పాటు గ్యాప్ తీసుకోబోతోంది. దీంతో గ్యాప్‌కు ముందే తెలుగులో రామ్‌చరణ్ ‘రంగస్థలం’ సినిమాను, తమిళ్‌లో విజయ్ సినిమాను పూర్తి చేయాలనేది సమంత టార్గెట్. మిగతా సినిమాలన్నీ పెళ్లి తర్వాతే.

Comments

comments