Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

సమంత గొప్ప నటి

Samantha U Turn Movie Teaser Released

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో పవన్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యు టర్న్’. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సమంత మా ట్లాడుతూ “పవన్‌కుమార్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. భవిష్యత్తులో అతనితో మరో సిని మా కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి మరింత స్టార్ పవర్ అందించారు”అని అన్నారు. దర్శకుడు పవన్‌కుమార్ మాట్లాడుతూ “సమంతతో ఈ సినీ ప్రయాణం అద్భుతంగా ఉంది. మా అమ్మగారి పుట్టిన రోజున సినిమా ట్రైలర్ విడుదల కావ డం ఆనందంగా ఉంది. ‘యు టర్న్’ ఆసక్తికరంగా ఉంటూనే నవ్విస్తూ ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది”అని తెలిపారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ “తొలిరోజు సినిమా షూటింగ్ పూర్తికాగానే గుడ్డిగా దర్శకుడిని నమ్మేశాను. పవన్‌కుమార్ ఏం చెబితే అది చేశాను. సమంత లాంటి ఉ త్తమ నటిని ఇప్పటివరకు కలవలేదు”అని చెప్పా రు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “పదేళ్ల కిం ద నేను, సమంత కలిసి పనిచేశాం. అప్పటికి ఇప్పటికీ సమంత నటిగా పూర్తిగా మారిపోయింది. గొప్ప నటిగా ఎదిగింది. ఆది  ఈ సినిమాలో పోలీ స్ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించాడు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ నికే త్ బొమ్మి, నిర్మాతలు శ్రీనివాస చిట్టూరి, రాంబా బు బండారు పాల్గొన్నారు.

Comments

comments