Search
Sunday 23 September 2018
  • :
  • :

సుధీర్ విషయంలో గర్వంగా ఫీల్ అవుతున్నా: మహేశ్

sanntgabam

సుధీర్‌బాబు, అదితీరావు హైదరి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సమ్మోహనం’. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో సినిమా ప్రీ రిలీజ్  ఫంక్షన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సంద ర్భంగా మహేష్ మాట్లాడుతూ “ఈ సినిమాలో సూపర్‌హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏడాది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ఇది అవుతుందని నరేశ్ నాకు చెప్పారు. సుధీర్‌బాబు విషయంలో నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ‘అష్టాచమ్మా’ నాకు ఫేవరేట్ ఫిలిం. అదితిరావుకు టాలీవుడ్‌లోకి వెల్‌కమ్ చెబుతున్నాను”అని అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ “ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అవుతుందో లేదోనని చిన్న సందేహం ఉండేది. అయితే మహేష్ ఎప్పుడైతే తన కొత్త లుక్‌తో ఈ వేడుకకు వస్తాడని తెలిసిందో అప్పుడు సినిమాపై మంచి నమ్మకం ఏర్పడింది. ‘సమ్మోహనం’ వంటి మంచి సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ నాకు ఇచ్చారు”అని పేర్కొన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ “నా మనసుకి నచ్చి ఇష్టపడి చేసిన సినిమా ‘సమ్మోహనం’. సుధీర్ మాత్రమే చేయగల పాత్రలో అతను అద్భుతంగా నటించాడు. అదితి నటనకు నేను ఫ్యాన్ అయ్యాను. వివేక్ బ్రిలియంట్ మ్యూ జిక్ ఇచ్చా రు”అని చెప్పారు. శివలెంక కృష్ణప్రసాద్ మా ట్లాడు తూ “సినిమా యూనిట్ అంతా కలిసి ఓ మంచి సినిమా చేశాం. ఇది నెక్స్ లెవెల్ మూవీగా అనిపిం చిం ది. మంచి పేరుతో పాటు డబ్బులు కూడా తెచ్చిపెట్టే సినిమా ఇది”అని పేర్కొన్నారు. అదితిరావు హైదరి మాట్లాడుతూ “తెలుగులో నా తొలి చిత్రమిది. సమీర అనే చాలా మంచి పాత్ర చేశాను. అద్భుతమైన పాత్రను నాతో చేయించిన ందుకు ఇంద్రగంటికి థాంక్స్. సుధీర్ అమేజింగ్ కోస్టార్‌”అని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో  కొరటాల శివ, హరీష్ శం కర్, వంశీ పైడిపల్లి, దిల్‌రాజు, వి వేక్ సాగర్, ఎస్.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, తనికెళ్ల భరణి, విజయ్, వెంకట్ రెడ్డి, సీనియర్ నరేశ్, పవిత్ర లోకే ష్, రామ జోగయ్య శాస్త్రి, కాదంబరి కిరణ్  పాల్గొన్నారు.

Comments

comments