Home తాజా వార్తలు చిరు చేతుల మీదుగా ‘సమ్మోహనం’ టీజర్!

చిరు చేతుల మీదుగా ‘సమ్మోహనం’ టీజర్!

sammohanam

హైదరాబాద్: యువ కథానాయకుడు సుధీర్‌బాబు, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోమన్‌కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతుకున్న చిత్రం ‘సమ్మోహనం’.శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబుకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అదితిరావు హైదరి నటిస్తున్నారు.యూత్‌ఫుల్ ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్‌ను మే 1న రిలీజ్ చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రయూనిట్ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇటీవల యంగ్ హీరో నాగశౌర్య ‘ఛలో’ సినిమా ఫ్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే.