Search
Tuesday 20 November 2018
  • :
  • :

సంపూర్ణేష్‌బాబు త్రిపాత్రాభినయం!

సంపూర్ణేష్‌బాబు హీరోగా రూపొం దుతున్న చిత్రం ‘కొబ్బరి మట్ట’. రూపక్ రొనాల్డ్‌సన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాను న్నాడు. గుడ్ సినిమా గ్రూప్, అమృత ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి దాసరి నా రాయణరావు క్లాప్‌నివ్వగా మారుతి కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఈ సందర్భంగా దాసరి నారా యణరావు మాట్లాడుతూ “అసలు హీరో అయ్యేందుకు కావాల్సిన లక్షణాలు సంపూర్ణేష్‌బాబులో లేకున్నా ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగాడు. హృదయ కాలేయం ట్రైలర్ చూసి ఇతను హీరో ఏంటి అనుకున్నాను. కానీ మొదటిరోజు కలెక్షన్స్ చూసి సంతోషంగా అనిపించింది. కొబ్బరిమట్ట పోస్టర్ చాలా బావుంది”అని అన్నారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ “ఈ సినిమాలో పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడుగా మూడు పాత్రల్లో నటిస్తున్నాను. ఊరు మొత్తాన్ని చూసుకునే పాపారాయుడు ఏడుగురు భార్యలు, 32 మంది పిల్లలు, 56మంది మనవలు, మనవరాళ్లతో హాయిగా గడుపుతుం టాడు. మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తుండడం చాలా సంతో షంగా ఉంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిరాజేష్ పాల్గొన్నారు.

Comments

comments