Home టెక్ ట్రెండ్స్ నయా ఫీచర్లతో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎ8ఎస్

నయా ఫీచర్లతో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎ8ఎస్

 

న్యూఢిల్లీ:ఉత్తర కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు కంపెనీ శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ8ఎస్ ను తాజాగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేతో పాటు 8 జిబి ర్యామ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనక భాగంలో 24, 10, 5 మోగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మూడు కెమెరాలను అమర్చగా ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది.

ఈ ఫోన్‌కు చెందిన 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.30,485 ధరకు లభ్యం కానుండగా, 8 జిబి ర్యామ్ వేరియెంట్ ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు. జనవరి 15వ తేదీ నుంచి వినియోగదారలకు ఈ ఫోన్‌ను అందుబాటులోకి రానుంది.

ఫీచర్స్:

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్

6/8 జిబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్

512 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

24, 10, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

యూఎస్‌బీ టైప్ సి, డ్యుయల్ బ్యాండ్ వైఫై

3400 ఎంఏహెచ్ బ్యాటరీ

Samsung Galaxy A8S Smartphone Launched