Home టెక్ ట్రెండ్స్ శాంసంగ్ నుంచి మరో రెండు స్మార్ట్ ఫోన్లు…

శాంసంగ్ నుంచి మరో రెండు స్మార్ట్ ఫోన్లు…

Samsung launched new smartphones

ముంబయి: ప్రముఖ మొబైల్ తయారుదారు శాంసంగ్ సంస్థ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు తాజాగా రిలీజ్ అయ్యాయి. 6అంగుళాల స్క్రీన్, ఒకే బ్యాటరీ కెపాసిటీతో శాంసంగ్ గెలాక్సీ జె4ప్లస్, శాంసంగ్ గెలాక్సీ జె6ప్లస్ పేరిట కొత్త స్మార్ట్ ఫోన్లు తాజాగా ఇండియన్ మార్కెట్లోకి విడుదలైయ్యాయి. సెప్టెంబర్ 25 నుండి ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. బ్లాక్, బ్లూ, గోల్డ్ రంగులలో లభించే గెలాక్సీ జె4ప్లస్ ఫోన్ ధర రూ.10,990 కాగా,  బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ లలో లభించే గెలాక్సీ జె6ప్లస్ ఫోన్ ధర రూ.15,990గా సంస్థ నిర్ణయించారు.

శాంసంగ్ గెలాక్సీ జె4 ప్లస్ అద్భుత ఫీచర్లు…
6″ఇన్ఫినిటీ డిస్‌ప్లే (720×1480 పిక్సల్స్),స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్‌, వెనక భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 2 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 3,300ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి అద్భుతమేన ప్రత్యేకతలతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి రానుంది.

శాంసంగ్ గెలాక్సీ జె6 ప్లస్ అద్భుత ఫీచర్లు…

6″ఇన్ఫినిటీ డిస్‌ప్లే (720×1480 పిక్సల్స్), స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్‌, వెనక భాగంలో రెండు 13/5 మెగాపిక్స‌ల్ కెమెరాలు, ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జిబి ర్యామ్ 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం3,300ఎంఏహెచ్ బ్యాట‌రీ లాంటి అద్భుతమైన ప్రత్యేకతలతో ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లభించనుంది.