Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

విలేకరిపై పాక్ ఆంక్షలు

JOURNALIST1ఇస్లామాబాద్ : ఉగ్రవాదులకు అండగా నిలిచే అంశంపై పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య తలెత్తిన విభేదాలను కథనంగా వెలువరించిన ఓ విలేకరిపై పాక్ సర్కారు ఆంక్షలు విధించింది. ఆ విలేకరి దేశం విడిచి వెళ్లకుండా మంగళవారం నిషేధం విధించింది. దీంతో పాక్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. భారత్‌తో సంబంధాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ప్రభుత్వ నేతలు, నిఘా అధికారులు, సైన్యాధికారులు ఇటీవల వరుస సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా జరిగిన ఓ సమావేశంలో పాక్ దౌత్యపరంగా అంతర్జాతీయంగా ఏకాకిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ దేశ విదేశాంగ కార్యదర్శి నివేదిక ఇచ్చినట్లు ప్రముఖ పత్రిక డాన్ ఇటీవల ఓ కథనం వెలువరించింది. సిరిల్ అల్మీదా అనే విలేకరి ఆ కథనం రాశారు. హక్కానీ నెట్‌వర్క్, తాలిబన్, లష్కరే తోయిబా నేతలకు రహస్యంగా అందిస్తున్న మద్దతును నిలిపివేయాలంటూ శక్తివంతమైన సైన్యాన్ని , ఐఎస్‌ఐని ప్రభుత్వ అధికారులు సదరు సమావేశంలో హెచ్చరించారంటూ ఆ కథనంలోఉంది. డాన్ కథనం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

Comments

comments