Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఊకచెట్టు వాగును ఊడ్చేస్తున్న ఇసుక మాఫియా

‘‘మామూలు”గా తీసుకుంటున్న పోలీస్, రెవెన్యూ అధికారులు

Sand-Mafiaమదనాపురం: మండల పరిదిలోని దుప్పల్లి ఊకచెట్టు వాగులో ఇసుక తోడేళ్లు అక్రమంగా ఇసుకను ఊడ్చేస్తున్నారు. ప్రతి రోజు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుక వ్యాపారులు ట్రాకర్ల ద్వారా గ్రామాలకు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ శ్వేతామహంతి, ఎస్పీ రోహినీప్రియదర్శినీలు సీరియస్‌గా ఉన్నప్పటికి స్థానికంగా ఉన్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇసుక రవాణాను మామూలుగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లకు ఎలాంటి నెంబర్‌లు లేకుండానే అక్రమంగా ఇసుకను తరలిస్తూ వేలకు వేల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. నూతనంగా ఏర్పడిన మండలంలో ఎంతో ఉత్సాహంగా పని చేసి మండలాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్లాల్సిన అధికారులే మాముళ్ల మత్తులో పడి మండలాభివృద్దిని విస్మరిస్తూ అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ యజమానులకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక డిటిఓ విషయానికి వస్తే ప్రతి వాహనానికి తప్పని సరిగా ముందు వాహనం నెంబర్‌ను నమోదు చేయాలిసి ఉండగా ఇసుక రవాణా చేసే వాహనాలు అదికారుల కళ్లు గప్పి అక్రమ రవాణా చేసేందుకు వాహనాలకు నెంబర్‌లు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అదికారులు ఇప్పటికైనా స్పదించి మండలంలో కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టి భూగర్భ జలాలను పెంచి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Comments

comments