Home జగిత్యాల అక్రమ ఇసుక దందా!

అక్రమ ఇసుక దందా!

Sand Mafia in Jagitiala

కోరుట్ల రూరల్: అక్రమ ఇసుక రవాణాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోడంతోపాటుశిక్షలు విధిస్తామని అధికారు లు ఇసుక రవాణాలపై దృష్టిపెట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు సూచించిన అధికారులు అక్రమ ఇసుక రవాణాలను అదుపుచేయలేక పోయారు. కోరుట్ల మండలం మాధాపూర్ గ్రామ శివారులోని వాగుల్లోంచి ఇసుకను తోడుతూ ట్రాక్టర్లతో పట్టణాలకు చేరవేస్తు సొమ్ములు గడిస్తున్న అక్రమార్కులను అదుపుచేయలేక అధికారులు తనిఖీలు చేపట్టలేక మంత్రి మాటలను భేఖతారు చేస్తున్నారు.

వాగు ప్రాంతంలో ఇసుక డంపులు ధర్శనమిస్తుంటే అధికారులు నిద్ర మత్తులో ఉన్నారనే సందేహాలు వెలువడుతున్నాయి. వాగు వద్దే జాలిపడుతు సన్నం ఇసుకలు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఒక్కొ ట్రాక్టర్ నిత్యం పది ట్రిప్పుల సన్నం ఇసుకల రవాణాలతో ట్రిప్పుకి 4 వేల రూపాయలు తీసుకొని పట్టణాలకు చేరుస్తు న్నట్టుగా ట్రాక్టర్ల యాజమానులు చెపుతున్నారు. ఇంత ధర్జాగా ఇసుక దందాలు నడుస్తున్న పట్టింపు చర్యలు ప్రశ్నించే విధంగా ఉన్నాయి.

ఉదయం 11 గంటలకు జాతీయ రహాదారిపై ఇసుక ట్రాక్టర్

పల్లె వాగులోంచి సరాసరి రోడ్డుపైకి చేరి జోరుగా వెలుతున్న ఇసుక ట్రాక్టర్‌ని అపే వారు లేకపోడం విడ్డురమే కదా.అంతే కాక ఉతయం 11 గంటలకు జాతీయ రహాదారి పొడవున వెల్లిన పట్టించుకునే వారు లేకపోయారంటే మంత్రిమా టలు కూడా పట్టించుకున్న వారు లేరంటే నవ్విపోదురుగా. ఉదయం పూటనే ఇలా ఉంటే రాత్రివేళల్లో అక్రమ ఇసుక వ్యాపారులను అదుపు చేసేవారవరు?.నిత్యం వాగుల్లోంచి కూలీల సహయంతో వందల ట్రాక్టర్లలో ఇసుక రవాణాలు జరిగితే భూగర్భ జలాలు అడుగంటవా. గతంలో నీటి కష్టాలతో పంటలు పండించే రైతులతో పాటు తాగునీటికై తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన జనాలను అధికారులు మరిచారా. నిత్యం పదుల సంఖ్యల్లో ఇసుక ట్రాక్టర్లు రోడ్డుపై వెలుతూనే ఉన్నాయి. నీటి సమస్యలు తీరలంటే ప్రతి ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రభుత్వంతో పాటు అధికారులు సూచించారుగా.

20 నిమిషాల్లో ఇసుక నిండిన ట్రాక్టర్ సిద్ధం

కేవలం 20 నిమిషాల్లో వాగును తోడి ఇసుకను ట్రాక్టర్లలో నింపేందుకు 10 మంది కూలీలు శ్రమిస్తుంటారు. వారి దిన సరి కూలీ 3 వందలు మాత్రమేనట చకచక పనులు చేస్తుంటా రు. యజామనులు వాగు వద్ద ఓ పక్కన కూర్చుం డి పనులు కానియ్యండని కూలీలను కోరుతుం టారు. కేవలం 3 వందలు మాత్రమే కూలీలకు వెలుతుంటే రోజు లక్షల్లో లాభాలు గడించే ఇసుక వ్యాపారులు ఎవరికి భయపడతారు. అధికారులు తనిఖీలు చేస్తేకదా ఇసుక వ్యాపారు లు జంకేది.

అలాగే కోరుట్ల పట్టణంలోని ఆనంద నగర్ ప్రాంతంలో ప్రతి రోజు ఇసుక అక్రమ రవాణాలు కొనసాగుతేనే ఉన్నాయి. వాగుల్లో నుండి ఇసుకను తోడేస్తు ఇష్టారాజ్యంగా ఇసుక దందాలు నడుపు అక్రమ సంపాదనలతో పబ్బం గడుపుతునాన్న వారేందరో ఉన్నారు. పల్లెల నుండి వేకువ జాము నుండే పట్టణాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుంటే అధికా రుల మమూళ్ళ తనిఖీలు చేస్తున్నారా అనే సందేహాలు వెలువడు తున్నాయి. వీదుల్లో నిత్యం ఇసుక ట్రాక్టర్లు అతివేగంతో జోరుగా వెలుతునే ఉనాయి. ప్రభు త్వ ఖర్చులతో నీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చిన విషయం మరిచారంటే ప్రభుత్వ మాటల కు ఎంతగా ప్రాదాన్యమిస్తు న్నారో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైన అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి అక్రమ ఇసుక రవాణాలను ఆపాలని పలువురు కోరుతున్నారు.