Home తాజా వార్తలు దర్జాగా ఇసుక దందా

దర్జాగా ఇసుక దందా

యథేచ్ఛగా రవాణా
మండలంలో భారీగా డంప్‌లు
మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు
చిన్న వాగును సైతం వదలని వైనం
ఇంకిపోతున్న నదీజలాలు

మూసీ, కృష్ణానది, అన్నమేరువాగు, రాజవరం వాగుల నుంచి కొందరు అక్రమార్కులు ఇసుకను తోడేస్తున్నారు. ఏ

Sand-Mafia_manatelanganaచిన్న వాగును సైతం వదలకుండా దందా నిర్వహిస్తున్నారు. దీంతో నదిలోని నీటి పరిమాణం రోజురోజకూ తగ్గిపోతోంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల వెంట ఇసుక డంప్‌లు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు గడిస్తున్నారు. కళ్ల ఎదుట ఇసుక డంప్‌లు నిర్వహించి దందా నిర్వహిస్తున్నా ఇటు పోలీసులు, అటు రెవెన్యూ అధికారులు నోరు మెదపడంలేదు.
దామరచర్ల : మండలంలో ప్రవహిస్తున్న మూసీ, కృష్ణానది, అన్నమేరువాగు, రాజవరం వాగుల నుంచి కొందరు అక్రమా ర్కులు ఇసుకను తొడేస్తున్నారు. దారి ఉంటే ఏ చిన్న వాగును సైతం వదలకుండా దందా నిర్వహిస్తున్నారు. దీంతో నదిలోని నీటి పరిమాణం రోజురోజకూ తగ్గిపోతోంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల వెంటనే ఇసుక డంప్‌లు ఏర్పాటు చేసి లక్షల రూ పాయలు గడిస్తున్నారు. దామరచర్ల మండలంలో గుట్టుచప్పు డు కాకుండా ఇసుక దందా సాగుతోంది. మండల పరిధిలోని వాడపల్లి, తెట్టెకుంట, చిట్యాల గ్రామాల్లో భారీగా డంప్‌లు ఏర్పాటు చేసి ఇసుకను అవసరమైన వారికి అమ్ముకుంటున్నా పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. మండలంలోని కేశవాపురం పంచాయతీ పరిధిలోని మంగల్ దుబ్బతండా, తెట్టె కుంట, వాచ్యాతండా శివారుగుండా ప్రవహిస్తున్న మూసీ నది నుంచి ఇసుకను వెలికి తీస్తున్నారు. స్థానికంగా ఉన్న అధికారు లు, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై ఇసుక మాఫియా యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడు తోంది. ఎవరైనా అధికారులు, పోలీ సులు వస్తున్న సమాచారం వారికి ముందస్తుగానే తెలు స్తుండడంతో ఆ సమయంలో పక్కకు తప్పుకొని వారు వెళ్లగానే తిరిగి తమ పనులు కానిస్తున్నారు. దీంతో నదిలో నీటిమట్టం రోజు రోజుకూ తగ్గిపోతోందని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. తమ వ్యవసాయ బావులు, బోర్లలో కూడా భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీగా ఇసుక డంప్‌లు
Sand-Mafia_manatelangana1దామరచర్ల మండలంలోని వాడపల్లి, తెట్టెకుంట, చిట్యాల గ్రా మాల్లో డంప్‌లు ఏర్పాటు చేసి మూసీ నది నుంచి తరలిస్తున్న ఇసుకను కేశవాపురం, తెట్టెకుంట, వాడపల్లి గ్రామాల్లో డంప్ లు ఏర్పాటు చేయగా, హాలియా వాగు నుంచి తరలిస్తున్న ఇసు కను మొల్కచర్ల, కొత్తనందికొండ గ్రామాల్లో భారీగా డంప్‌లు ఏర్పాటు చేసి తరలిస్తున్నారు. ఆన్నమేరు వాగు నుంచి తరలిం చే ఇసుకను వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం వద్ద డంప్‌లు ఏర్పా టు చేస్తున్నారు.
మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు
కళ్ల ఎదుట ఇసుక డంప్‌లు నిర్వహించి దందా నిర్వహిస్తున్నా ఇటు పోలీసులు, అటు రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. అంతే కాకుండా ఏయే గ్రామాల్లో ఇసుక డంప్‌లు ఏర్పా టు చేశారో ఆయా గ్రామాల్లో మామూళ్ల విషయంమై తగా దాలు సైతం చోటు చేసుకున్న సంఘటనలున్నాయి. అధికా రులకు సైతం మామూళ్లు అందడంతోనే ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నామమాత్రపు చర్యలే
మూసీ నది నుంచి వందల ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నా అధి కారులు మాత్రం నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అప్పుడప్పుడు పట్టుకొని నామ మాత్రంగా జరిమానా విధిస్తూ వదిలేస్తున్నారు. దీంతో అక్రమా ర్కులు యథేచ్ఛగా ఇసుక రవాణాను కొనసాగిస్తున్నారు. ఇప్ప టికైనా అధికారులు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసు కోవా లని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
వాడపల్లిలో భారీగా డంప్‌ల స్వాధీనం
గత కొంత కాలంగా వాడపల్లిలో అభివృద్ధి పనుల పేరిట ప్రజా ప్రతినిధులు కొందరు మూసీ నుంచి వందల సంఖ్యలో ట్రాక్ట ర్లతో గ్రామంలో అనుకూలమైన ప్రతిచోట భారీగా ఇసుక డంప్ లు ఏర్పాటు చేశారు. ఇసుకకు భారీ డిమాండ్ ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా అమ్ముంటూ సొమ్ము చేసుకుంటున్నా రు. దీనిపై గురువారంనాడు స్థానికులు ఆగ్రహించి ట్రాక్టర్లను అడ్డుకొని అధికార్లకు సమాచారం అందించడంతో పోలీసులు రెండు ట్రాక్టర్లను స్వాధీన పర్చుకోగా, తహసిల్థార్ వేముల రమాదేవి, ఆరై సూర్యకుమారిలు గ్రామంలోని పోలీసు స్టేషన్ సమీపంలో, జడ్పిహెచ్‌ఎస్ పాఠశాల యందు, దేవాలయాల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన సుమారు 1540 ట్రాక్టర్ల మేర భారీ డంప్‌లను సీజ్ చేసి పంచనామా నిర్వహించారు. అనంతరం వాటిని మైనింగ్ శాఖ వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 25 లక్షల వరకు ఉండ వచ్చని స్తానికులు పేర్కొంటున్నారు.
చిట్యాలలో ఇసుక డంప్‌లను పరిశీలించిన డిఎస్‌పి
మండల పరిధిలోని చిట్యాల గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంప్‌లను మిర్యాలగూడ డీఎస్పీ సందీప్‌గోనె గురువారం పరిశీలించారు. అనంతరం వాడపల్లి పోలీస్‌స్టేషన్లో మండలం జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై ఆరాతీశారు. ఇసును అక్రమంగా నిల్వ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.