Search
Friday 21 September 2018
  • :
  • :

కారూరు వాగులో చెలరేగుతున్న ఇసుక మాఫియా

యధేచ్ఛగా రాత్రిబవళ్లు ఫిల్టర్ల నిర్వహణ

Sand-mafia

నవాబ్‌పేట: గత కొంత కాలంగా స్థబ్ధంగా ఉన్న కారూర్ వాగు ప్రస్తుతం ఇసుక ఫిల్టర్ల తో కళకళలాడుతోంది. వాగు పొడవునా ఫిల్టర్లను నిర్మించుకొని యదేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిపి లారీలు, ట్రాక్టర్లలో పట్టణాలు, గ్రామాలకు తరలిస్తు న్నారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని నెలలుగా స్థానిక పోలీసులు ఇసుక తవ్వకాలు, ఫిల్టర్లు, రవా ణాను పూర్తిగా నియంత్రించగా గత వారం రోజు లుగా ఇసుక మాఫియా మళ్లి చెలరేగిపోతూ ఇష్టా రాజ్యంగా రాత్రింబవళ్లు ఇసుక రవాణాను కొనసాగి స్తున్నారు. మండల కేంద్రానికి 8 కీమీ. దూరంలో ఉన్న కారూరు గ్రామ శివారులో ఒక వ్యక్తి షెడ్డును నిర్మించి నాలుగు ట్రాక్టర్లు, ఒక జేసిబితో షెడ్డుకు సమీపంలో పెద్ద ఫిల్టర్లు నిర్మించుకొని  వాగులో ఇసుకను తవ్వి ఫిల్టర్ల లో శుభ్రం చేసి పెద్ద పెద్ద డంపులను నిల్వ ఉంచి షాద్‌నగర్ నుంచి వచ్చే లారీలతో పాటు సమీప గ్రామాలకు ప్రతి రోజు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నాడు.

 అలాగే వాగు పొడవునా కారూ రుకు చెందిన మరి కొందరు వ్యక్తులు చిన్నచిన్న ఫిల్టర్ల ద్వారా ఇసుకను తయారు చేస్తూ రవాణా జరుగుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా సంబంధిత వ్యకి, వాహనాలపై కేసు నమోదు చేస్తామని, ఇసుకను పూర్తిగా ఇదివరకే నియంత్రిం చామని, దొంగచాటున ఇసుక ఫిల్టర్లను నిర్వహి స్తున్న  వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏది ఏమైనా  ఇసుక తవ్వ కాలతో సమీప రైతుల  పొలాల్లో బోరు బావుల నీటి మట్టం తగ్గిపోతోందని, గతంలో ఎన్నో సార్లు స్థానిక మండలాధికారులకు రైతులు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ స్వయంగా వాగులోని ఫిల్టర్లను ధ్వంసం చేసి ఇసుక తయారీని పూర్తిగా నియంత్రిం చగా ప్రస్తుతం కారూర్‌కు సమీపంలో పోలీసుల కళ్లు కప్పి పెద్ద మొత్తంలో ఇసుక దందాను నిర్వహించడం విశేషం. పోలీసుల స్పందించి వెంటనే అట్టి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జనాలు కోరుతు న్నారు.

Comments

comments