Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

డబుల్ బెడ్‌రూం ఇళ్ళ కు ఇసుక కరువు

Sand Not Sufficient To Build Double Bed Room Houses

డిచ్‌పల్లి ః మండలం బీబీపూర్ తండా వద్ద ప్రభుత్వం ఇండ్లు లేని పేద ప్రజలకు 52 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం చేసి కాంట్రాక్టర్ సిద్దంగా ఉంచారు. నిర్మాణం చేసిన డబుల్ బెడ్‌రూం ప్లాస్టింగ్ చేయటానికి ఇసుక లేక పనులు నిలిచి పోయాయి. జిల్లా అధికారులు శ్రద్ద తీసుకొని ఇసుకను పంపాలని తండా వాసులు కోరుతున్నారు. నియోజక వర్గ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ చొరవతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మెప్పించి జాతీయ రహదారి బీబీపూర్ తండా పేద ప్రజలకు ఇండ్లు నిర్మాణం చేయించి అర్హులైన వారందరికి ఇవ్వాలని కోరారు. ఇకనైనా అధికారులు స్పందించి ఇసుకను పంపి డబుల్‌ బెడ్ రూం నిర్మాణం పనులు పూర్తి అయిన ఇండ్లకు ప్లాస్టింగ్ చేసి త్వరగా ఇండ్లను పంపిణీ చేయాలని కొరుతున్నారు.

Comments

comments