Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు…

Sand should removed from permits issued by TSMDC

మిడ్జిల్: టిఎస్‌ఎండిసి ఇచ్చిన పరిమితుల మేరకే తవ్వకాలు జరపాలని, అనుమతికి మించి ఇసుకను తీయడం, తరలిస్తే అనుమతులు రద్దు చేయబడతాయని తహసిల్దార్ పాండునాయక్ పెర్కోన్నారు. మండల పరిధిలోని మిడ్జిల్ గ్రామ శివారులోని సర్వే నం 337, 338, 340 ఈ నంబర్‌లలో టిఎస్‌ఎండిసి ద్వారా ఇసుక తీయుటకు అనుమతులు ఇవ్వటం జరిగిందన్నారు. ఆన్ లైన్ ద్వారా అనుమతులు పోందిన వాహనాలు మాత్రమే ఇసుక తరలించాలని, అనుమతులు లేకుండా అక్రమ పద్దతిలో ఇసుకను తరలిస్తే ఇచ్చిన అనుమతులను రద్దు చేయటం జరుగుతుందన్నారు, గురువారం అనుమతులకు మించి ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేయగా తాహసిల్దార్ తన సిబ్బందిని తనిఖీ నిమిత్తం అనుమతులు ఇచ్చిన ప్రదేశానికి పంపి వివరాలు సేకరించారు. 10.5 క్యూబిక్ మీటర్ల ఇసుకను మాత్రమే భారి వాహనాలలో తరలించావలసివుండగా పరిమితికి మించి ఒక్కో వాహనంలో 40 టన్నుల వరకు ఇసుకను నింపి దూర ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా వుండే టిఎస్‌ఎండిసి అధికారులు ఇసుక అనుమతులకు మించి తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని, అనుమతులకు మించి అక్రమంగా ఇసుకను తరలించి సోమ్ము చేసుకుంటున్నా అధికారులు మీన వేశాలు వేస్తున్నారని చుట్టు ప్రక్కల పంట పోలాల రైతులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది విఆర్‌ఒ వెంకటేష్, విఆర్‌ఎ కరుణాకర్‌లు వున్నారు.

Comments

comments