Home టెక్ ట్రెండ్స్ ప్రపంచంలోనే అతి చిన్న పెన్ డ్రైవ్…!!

ప్రపంచంలోనే అతి చిన్న పెన్ డ్రైవ్…!!

Sandisk-pendrive

లాస్‌వెగాస్‌ : ప్రపంచంలోనే అత్యంత స్మాల్ సైజ్ పెన్ డ్రైవ్‌ను సాన్‌డిస్క్ సంస్థ తాజాగా రిలీజ్ చేసింది. లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సిఈఎస్) 2018లో సాన్‌డిస్క్ తన అల్ట్రాఫిట్ యుఎస్‌బి 3.1 ఫ్లాష్ డ్రైవ్‌ను విడుదల చేసింది. ఈ డ్రైవ్ 16, 32, 64, 128, 256 జిబి స్టోరేజ్ వేరియెంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ పెన్ డ్రైవ్‌ ప్రారంభ కొనుగోలు ధర రూ.1400, ఇక పెన్ డ్రైవ్‌లలో 256 జిబి స్టోరేజ్ లో  ఏకంగా 14వేల ఫొటోలు, 10 గంటల ఫుల్ హెచ్‌డి వీడియోలు, 16వేల పాటలను స్టోర్ చేసుకొడానికి అనుకూలంగా ఉంటుంది. యుఎస్‌బి టైప్ సి సపోర్ట్ ఉండటం వల్ల ఈ డ్రైవ్‌లోకి వేగంగా ఫైల్స్‌ను  అతి సులువుగా కాపీ చేసుకోవచ్చు.