Home తాజా వార్తలు సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి

సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి

JAGGAREDDYసంగారెడ్డి : అమీన్‌పూర్ సర్పంచ్‌ను బర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్‌ను ఆ పార్టీ నేతలు , కార్యకర్తలు ముట్టడించారు. టిఆర్‌ఎస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ సభ విజయవంతం కావడంతో టిఆర్‌ఎస్ ఉలికిపాటుకు గురవుతోందని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు చిల్లర రాజకీయాలు మానుకోకపోతే, ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో జగ్గారెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.