Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మాజీ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి అరెస్టు

JAGGAREDDYమెదక్: సంగారెడ్డి మాజీ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి, మల్లన్నసాగర్ నిర్వాసితులకు మద్దతుగా దీక్ష చేపట్టేందకుగాను ర్యాలీగా బయలుదేరారు. సంగారెడ్డి ఓల్డ్ బస్టాండు నుంచి పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే ర్యాలీని అడ్డుకున్న పోలీసులు జగ్గారెడ్డిని అరెస్టు చేశారు. ఆయన తలపెట్టిన అమరణ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున దీక్షకు అనుమతి లేదని డిఎస్‌సి తిరుపతన్న వెల్లడించారు. అరెస్టు అనంతరం జగ్గారెడ్డిని ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Comments

comments