Search
Friday 16 November 2018
  • :
  • :

యుఎస్ ఓపెన్‌లో సానియా జోడి జోరు

Sania-and-Strycovaన్యూయార్క్: యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా-స్ట్రైకోవా(చెక్ రిపబ్లిక్) జోడి జోరు చూపిస్తోంది. మెరుగైన ప్రదర్శనతో ఈ ద్వయం క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. భారత కామానం ప్రకారం మంగళవారం వేకువజామున జరిగిన మహిళల టెన్నిస్ డబుల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో సానియా-స్ట్రైకోవా జోడి 6-4, 7-5తో నికోల్ గిబ్స్(అమెరికా)-హిబినో(జపాన్) ద్వయంపై విజయం సాధించింది. తొలి సెట్‌ను సులభంగా గెలుచుకున్న సానియా ద్వయానికి రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనప్పటికి పైచేయి సాధించి క్యార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. క్వార్టర్ ఫైనల్‌లో గార్సికా-మ్లెడనోవిక్ జోడితో సానియా-స్ట్రైకోవా ద్వయం తలపడనుంది.

Comments

comments